![]() |
![]() |

"డాన్స్ ఇండియా డాన్స్" షో కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కూడా "గాలోడు" ఫుల్ ఎంటర్టైన్ చేసాడు. గాలోడు స్టేజి మీదకు రాగానే బాబా మాస్టర్ వచ్చి సుధీర్ కి సరిగ్గా సరిపోయే పేరు గాలోడు అని కరెక్ట్ గా పెట్టారు అన్నాడు. ఆ కామెంట్ తో సుధీర్ తన ఫేస్ వెరైటీగా పెట్టేసరికి గాలి అంటే ఒక చోట ఉండదు కదరా. అలా తిరుగుతూనే ఉంటుంది. నువ్వు కూడా అంతే అన్నాడు బాబా.
ఇక సుధీర్ "మీకు అలుపొస్తదేమో నాకు ఊపొస్తది" అని బాలయ్య డైలాగ్ చెప్పేసరికి స్టేజి మొత్తం నవ్వులే నవ్వులు. ఈ స్టేజి మీద ఫస్ట్ టైం రౌడీ రోహిణి ఇరగదీసే డాన్స్ వేసి ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇక బాబా మాస్టర్ కి రోహిణి డాన్స్ నచ్చేసింది. ఇక అకుల్ బాలాజీ " మా డాన్స్ ఇండియా డాన్స్ లో నువ్వు బంగారు కోడిపెట్టే" అని కంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. దాంతో రోహిణి "థ్యాంక్యూ ...కానీ గుడ్లు మాత్రం అడగొద్దు" అని కామెడీ చేసింది.. ఇక రోహిణి మీద సోషల్ మీడియాలో వచ్చే బాడీ షేమింగ్ కామెంట్స్ గురించి చెప్తూ రోహిణి సోదరి స్టేజి మీద ఎమోషనల్ అయ్యింది.
![]() |
![]() |